Widgets Magazine

వీవో నెక్స్‌పై కొత్త ఆఫర్.. రూ.13వేల వరకు తగ్గింపు

Last Updated: శుక్రవారం, 4 జనవరి 2019 (10:45 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ అయిన వీవో.. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై 8,000 ప్లస్ 5,000 మొత్తం రూ.13వేల వరకు ఆఫర్ ప్రకటించింది. వీవో గత జూలైన నెలలో నెక్స్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలి ఇన్-డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన కొత్తలో రూ.47,ధర పలికింది. 
 
ప్రస్తుతం 8వేల రూపాయలను ఈ మోడల్‌కు తగ్గించడంతో రూ.39,990 ధరకు పలుకుబడి అయ్యింది. ఇంకా అమేజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.5వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించింది.
 
వీవో నెక్స్ ఫీచర్ల సంగతికి వస్తే.. 
* 6.59 ఇంచ్ 2316x1080 పిక్సల్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED 19:3:9 డిస్‌ప్లే 
* 2.8 జిజాహెట్జ్ అక్టోకోర్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్ సెట్, అడ్రినో 630 జీపీయూ 
* 8 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ 
* 12 ఎంబీ డ్యుయెల్ పీడీ ప్రైమరీ కెమెరా, డుయెల్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్, సోనీ IMX363 సెన్సార్, f/1.8 
* 5 ఎంబీ సెల్ఫీ కెమెరా,  f/2.0
* డ్యుయల్ సిమ్ స్లాట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. 


దీనిపై మరింత చదవండి :