మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (12:38 IST)

పూజారా సెంచరీతో అదరగొట్టాడు.. మయాంక్ 77 పరుగులతో రికార్డు కొట్టాడు..

భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో పూజారా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు పుజారా గట్టి పునాది వేశాడు. ఫలితంగా 199 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.


ఈ సెంచరీతో పూజారా ఈ సిరీస్‌లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో 18వ సెంచరీని పూజారా తన ఖాతాలో వేసుకున్నాడు. పూజారా శతకాల్లో మొత్తం 13 ఫోర్లు వున్నాయి. 
 
ఇకపోతే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించిన కోహ్లీ సేన.. నాలుగవ టెస్టులోనూ మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. గురువారం ఉదయం ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే నిష్క్రమించినా.. ఆ తర్వాత మయాంక్‌, పుజారాలు రెండవ వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

దూకుడుగా ఆడిన మయాంక్ 77 రన్స్ చేసి ఔటయ్యాడు. అయినా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. 
 
గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సు‌ల్లో 76, 42 పరుగులు చేసి విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసినన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన మయాంక్.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులు సాధించి మరో రికార్డు నెలకొల్పాడు.

కెరీర్ తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు అర్థశతకాలు సాధించిన భారత ఓపెనర్‌గా నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై కనీసం రెండు అర్థసెంచరీలు సాధించిన ఎనిమిదో భారత ఓపెనర్‌గా ఘనత వహించాడు.