Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు: కోహ్లీ ఇన్నింగ్స్ వృధా.. 135 పరుగుల తేడాతో ఓటమి

బుధవారం, 17 జనవరి 2018 (18:12 IST)

Widgets Magazine

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా విధించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 
 
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3, రోహిత్ శర్మ 47, షమీ 28, ఇషాంత్ శర్మ 4 (నాటౌట్), బుమ్రా 2 పరుగులు సాధించారు.  
 
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 6 వికెట్లు తీయగా రబాడా 3 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేసింది. 
 
రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో చేసినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్‌ల గెలుపు తర్వాత పదో టెస్టులో భారత్ ఓడింది. ఇక  ఈ నెల 24న జోహెన్స్‌బర్గ్‌లో మూడో టెస్ట్ జరగనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సెంచూరియన్ టెస్టు : విజయానికి 252 రన్స్ దూరంలో కోహ్లీ సేన

సెంచూరియన్ పార్క్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ...

news

క్రికెట్ మైదానంలో ప్రమాదం: షోయబ్ మాలిక్ తలకు గాయం.. విలవిల్లాడిన సానియా భర్త

మృతి చెందడం యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే గత ఏడాది బౌలర్‌ వేసే ...

news

అండర్-19 ప్రపంచకప్: వికెట్ పడకుండా పపువాపై భారత్ ఘనవిజయం

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పపువా న్యూగినియాపై భారత్ పది వికెట్ల ...

news

బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. ఇంకా సఫారీ గడ్డపై?

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ...

Widgets Magazine