Widgets Magazine

సఫారీలతో టెస్టు: కోహ్లీ ఇన్నింగ్స్ అదుర్స్.. 307 పరుగులకు ఆలౌట్

సోమవారం, 15 జనవరి 2018 (17:51 IST)

సఫారీలతో సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌటయ్యింది. సారథి విరాట్ కోహ్లీ (153; 217 బంతుల్లో 15×4) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో పాటే జట్టు తొలి ఇన్నింగ్స్‌కూ తెరపడింది. 92.1 ఓవర్లకు 307 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 335కు 28 పరుగుల దూరంలో నిలిచింది.
 
టీమిండియా బ్యాటింగ్‌లో ఓవైపు వరుసగా వికెట్లు నేలకూలుతున్నా కోహ్లీ ఏకాగ్రత కోల్పోకుండా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 217 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి, చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ ప్రతిభతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. దీంతో, దక్షిణాఫ్రికా కన్నా తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు వెనుకబడి ఉంది.
 
భారత బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ 46 పరుగులతో ఓకే అనిపించాడు. చివర్లో కోహ్లీకి అండగా నిలబడ్డ అశ్విన్ 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగిలిన వారిలో రాహుల్ 10, పుజారా డకౌట్, రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, పాండ్యా 15, షమీ 1, ఇషాంత్ శర్మ 3 పరుగులు సాధించారు.  సఫారీ బౌలర్లలో మోర్కెల్ నాలుగు వికెట్లు తీయగా,  మహారాజ్, ఫిలాండర్, రబాడా, ఎన్గిడిలు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
India Centurion Ashwin Virat Kohli 2nd Test India Vs South Africa

Loading comments ...

క్రికెట్

news

సెంచూరియన్ టెస్ట్ : సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్ 335 ఆలౌట్

సొంతగడ్డలోని సెంచూరియన్ పార్కు వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ...

news

మళ్లీ పెళ్లి చేసుకోనున్న విరుష్క దంపతులు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరోమారు పెళ్లి ...

news

అండర్ -19 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా చిత్తు.. భారత్ విజయభేరీ

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ...

news

అజారుద్ధీన్ వార్: హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న బీసీసీఐ

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడితో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌ మధ్య ...

Widgets Magazine