Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లయ్యాక కోహ్లి-అనుష్క ఇలా తయారయ్యారేమిటి?

బుధవారం, 10 జనవరి 2018 (16:11 IST)

Widgets Magazine

గత నెల డిసెంబర్‌లో వివాహబంధంతో ఒక్కటైన విరాట్ అనుష్క జంటకు కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కనబడుతోంది. ఒకప్రక్క విరాట్ దక్షణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో పాల్గొంటూనే భార్య అనుష్కతోనూ సమయాన్ని గడిపాడనుకోండి. మొన్న జరిగిన మొదటి టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ల పేలవ ప్రదర్శనతో పరాజయం చెందింది. కాగా విరాట్ ఇప్పటికే సూపర్ విక్టరీలు సాధించి, గొప్ప కెప్టెన్‌గా ఎదుగుతున్న సమయంలో పెళ్లి చేసుకున్నాడు. 
Kohli-anushka
 
ఈ టెస్ట్ పరాభవంతో భారత జట్టు విదేశీ గడ్డపై తడబడుతుందని మరోసారి రుజువయ్యింది. మరోప్రక్క అనుష్క శర్మ నటిగానే కాకుండా నిర్మాతగానూ అవతారమెత్తింది. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'పరి' సినిమాకి నిర్మాతగా ప్రోసిత్ రాయ్ అనే కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేస్తోంది. ఈ సినిమా టీజర్‌ను అనుష్క ట్విట్టర్‌లో విడుదల చేసింది. టీజర్‌లో బాధగా చూస్తున్న అనుష్క ముఖం ఒక్కసారిగా రక్తపుమరకలతో భయానకంగా మారడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 
 
ఈ టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, 'స్వీట్ డ్రీమ్స్‌ గాయ్స్' అని ట్వీట్ చేసింది. ఇలాంటి పాత్రను తాను చేయడం ఎంతో ఛాలెంజింగ్‌గా ఉందని మరియు క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తానే నిర్మించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ చిత్రం తన బ్యానర్‌లో 'ఎన్‌హెచ్ 10', 'ఫిల్లౌరీ' సినిమాల తర్వాత మూడో చిత్రంగా రాబోతుంది. ఇందులో అనుష్క‌తో పాటు రీటాభరీ చక్రవర్తి, పరంబాత్రా చటర్జీ, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ సినిమాని హోలీ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం షారుక్‌కి జోడీగా 'జీరో' అనే చిత్రంలో, వరుణ్ ధావన్‌కి జోడీగా 'సూయీ ధాగా' చిత్రాలతో బిజీగా ఉంది. వివాహమయ్యాక కొన్ని రోజుల విరామం తీసుకున్న అనుష్క దక్షణాఫ్రికా నుండి వచ్చిన వెంటనే ఈ చిత్రాలతో మళ్లీ బిజీ కానుంది. ప్రస్తుతానికైతే 'పరి' సినిమా టీజర్‌ని మీరూ చూసి ఆనందించండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నీలియోన్ వచ్చేస్తోంది.. తలపట్టుకున్న కోలీవుడ్ భామలు..

ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుని దక్షిణాదిన కాలు మోపిన పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ ...

news

'బాహుబలి 1', 'ఖైదీ నంబర్ 150' రికార్డును బ్రేక్ చేసిన 'అజ్ఞాతవాసి'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం బుధవారం ...

news

'పద్మావతి'కి ఓకేగానీ... 300 కట్స్ అవాస్తమట...

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ ప్రధాన పాత్రల్లో సంజయ్ ...

news

పవన్ మానియా.. ఒక్క షో పడకుండానే రికార్డులు... ఎక్కడ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. చేసిందే 25 సినిమాలే అయిన ప్ర‌జ‌ల ...

Widgets Magazine