ఒకేసారి 10 మందితో వాయిస్ కాలింగ్.. ఎలా?
దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో మరో సరికొత్త యాప్‌ను తీసుకునిరానుంది. అదీకూడా ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే. ఈ కొత్త యాప్ ట్రయల్ వెర్షన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'జియో గ్రూప్ టాక్' యాప్ సాయంతో గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఒకేసారి 10 మంది వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, మ్యూట్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. అలాగే, ఇందులో లెక్చర్ మోడ్ తదితర ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ట్రయల్ మోడ్‌లో ఉన్న యాప్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో ప్రకటించింది.
జియో సిమ్ ఉన్న ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేసే డివైజ్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌ను రూపొందించారు. ట్రయల్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. జియో నంబర్ ఉన్న యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.