ఇక జియో ఫోన్‌లో వాట్సాప్ యాప్..

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో విడుదల చేసిన జియో ఫోన్‌లో వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియోఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది

reliance jio
selvi| Last Updated: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (16:44 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో విడుదల చేసిన జియో ఫోన్‌లో వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియోఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గత నెల 15 నుంచి వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను అందుబాటులో తెస్తామని జియో ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. 
 
తాజాగా దేశ వ్యాప్తంగా జియో ఫోన్‌‌లో తొలిసారి వాట్సాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. వాట్సాప్‌ కోసం జియోఫోన్‌లో ప్రత్యేకమైన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (కైఓఎస్)ని డెవ‌ల‌ప్ చేశారు. వాట్సాప్ యాప్‌ను ఉపయోగించాలనుకునే జియోఫోన్ వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందని సంస్థ తెలిపింది. 
 
ఆపై త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను వెరిఫై చేసుకోవ‌డం ద్వారా జియో ఫోన్ యూజ‌ర్లు వాట్సాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సాప్‌ అందుబాటులోఉంటుందని జియో తెలిపింది. కాగా భారత దేశంలో జియో భారీ అమ్మకాలను నమోదు చేసింది పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్‌ చేసిన జియో ఫోన్‌ కీలక మైలురాళ్లను అధిగమించింది.దీనిపై మరింత చదవండి :