ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (09:21 IST)

నేటి నుంచి జియో 4జీ ఫీచర్ ఫోన్స్ బుకింగ్స్ స్టార్ట్

ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్స్ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఈ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో మై జియో యాప్‌తోపా

ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్స్ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఈ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో మై జియో యాప్‌తోపాటు, జియో డాట్‌కామ్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. 
 
ఇక ఆఫ్‌లైన్‌‌లో జియో రిటైల్ స్టోర్లు, మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ‘జియో ఫోన్’ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. బుకింగ్ సందర్భంగా తొలుత రూ.500 చెల్లించాల్సి ఉంటుందని, మిగతా వెయ్యిరూపాయలు డెలివరీ సమయంలో చెల్లించవచ్చని తెలిపింది. ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చని వివరించింది. 
 
కాగా, పేరుకు ఇది ఫీచర్ ఫోనే అయినా, దీంట్లో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని ఫీచర్లూ ఉంటాయి. అన్ని రకాల యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. సినిమాలు చూసుకోవచ్చు. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది.