ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (10:46 IST)

రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ

jioservice
జియో టెలికాం సర్వీస్‌లో కస్టమర్లకు తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీగా జియో ఈ బెనిఫిట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 
 
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 24 జీబీ డేటాతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ ఇది. మళ్లీ మళ్లీ రీఛార్జీ చేసుకోకుండా ఈ ప్లాన్‌ యూజర్లు ఎంచుకోవచ్చు. 
 
ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. 
 
దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి.