గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు

sundar pichai
Last Updated: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (09:20 IST)
మీటూ ఉద్యమం దిగ్గజ టెక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చేరింది. ఈ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించినందుకు 48 మంది ఉద్యోగులపై ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ వేటు వేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
 
గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ మేరకు సుందర్ పిచాయ్ ఫాక్స్ న్యూస్‌కు ఈ మెయిల్ పంపించారు. 
 
లైంగిక వేధింపులకు పాల్పడిన 13మంది సీనియర్ మేనేజర్లను కంపెనీ తొలగించిందని పిచాయ్ అందులో పేర్కొన్నారు. గూగుల్‌లో ఎవరైనా ఉద్యోగినులు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే వారికి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
 
పనిప్రదేశంలో ఉద్యోగినిలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మెయిల్‌లో గూగుల్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ఇలీన్ నౌగటన్ సంతకం చేశారు. దీనిపై మరింత చదవండి :