Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

బుధవారం, 22 నవంబరు 2017 (15:20 IST)

Widgets Magazine
mi phones

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, భారత మొబైల్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌ను సొంతం చేసుకునే సదుపాయాన్ని తొలిసారి కల్పించింది.
 
ఇందుకోసం న్యూఢిల్లీకి చెందిన క్యాషిఫై అనే సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సౌక‌ర్యం ద్వారా భార‌త వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్ల‌ను ఎంఐ స్టోర్‌లో ఇచ్చేసి, కొత్త ఎంఐ స్మార్ట్‌ఫోన్ పొంద‌వ‌చ్చు. అయితే పాత ఫోన్ల‌కు ఎంత ధ‌ర నిర్ణ‌యించాల‌నే హ‌క్కును షియోమి, క్యాషిఫై సంస్థ‌కు అప్ప‌గించింది.
 
వారు నిర్ణ‌యించిన ధ‌ర‌కు అనుగుణంగా, కొత్త ఎంఐ ఫోన్ ధ‌ర‌లో డిస్కౌంట్ ఇస్తారు. మీ పాత మొబైల్ విలువ ఎంత ఉంటుందో క్యాషిఫై యాప్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. క్యాషిఫై వారి ఎక్స్చేంజ్ ధ‌ర న‌చ్చిన వారు త‌మ మొబైల్ ఫోన్‌ను ఇచ్చేసి, కొత్తగా ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వైఫై డబ్బా: 1 జీబీ డేటా రూ.20 మాత్రమే.. రూ.2కి 100 ఎంబీల డేటా

రిలయన్స్ జియో ఉచిత డేటా పేరిట టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. జియోకు ...

news

3 సెకన్లలో 2 గంటల సినిమా డౌన్‌లోడ్‌.. ఇదీ 5జీ నెట్ స్పీడ్

దేశంలోని టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా అందించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్లు.. రూ.1799

రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను ...

news

భారత్‌లో తొలిసారి 5జీ : 3 మిల్లీ సెకన్లలో 5.7 జీబీపీఎస్

భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో ...

Widgets Magazine