గూగుల్ ప్లే స్టోర్‌లో "మై జియో యాప్" కొత్త రికార్డు- ఏడాదిలో పది కోట్లమంది డౌన్లోడ్ చేసుకున్నారట..!

శనివారం, 12 ఆగస్టు 2017 (12:29 IST)

JioFi

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఖాతాలో మరో రికార్డు పడింది. ''మై జియో'' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే యాప్స్ ఉచిత డౌన్ లోడ్ లో 'మై జియో' తొమ్మిదో స్థానంలో నిలవడంతో పాటు కేవలం ఏడాది వ్యవధిలోనే జియో ఈ రికార్డును సాధించింది. ఇక జియో మ్యూజిక్, జియో సినిమా, జియో మనీ వ్యాలెట్, జియో చాట్ తదితర యాప్‌లన్నీ కోటికి పైగా డౌన్ లోడ్‌లను సాధించాయి. 
 
భారత్‌లో తయారైన మొబైల్ యాప్‌లలో పది కోట్ల మైలురాయిని తాకిన రెండో యాప్ "మై జియో'' కావడం గమనార్హం. ఈ యాప్‌ను వాడుతూ రిలయన్స్ జియో కస్చమర్లు రీఛార్జ్‌తో పాటు బ్యాలెన్స్ తదితరాలను చెక్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన టెలికాం రంగ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌  సంస్థలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 మిలియన్ల మేరకే డౌన్‌లోడ్లను నమోదు చేసుకున్నాయి. దీనిపై మరింత చదవండి :  
Download Mark Reliance Myjio App 100 Million Downloads Google Play Store

Loading comments ...

ఐటీ

news

అమ్మాయిలు కావాలంటున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుందర్ పిచాయ్ అమ్మాయిలు, మహిళా శక్తిసామర్థ్యాలపై ...

news

వాట్సాప్‌లో ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ "ఇన్‌‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్" ఫీచర్‌ను ...

news

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో ట్యాబ్ 'వాచ్'

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ...

news

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ...