ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (11:55 IST)

నగుదు రహితానికి ప్రోత్సాహం : అదనపు ఛార్జీలు రద్దు

కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేపట్టింది. రూ.2000 వరకు జరిపే అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటును

కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేపట్టింది. రూ.2000 వరకు జరిపే అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని, ఈ లావాదేవీలపై వినియోగదారులు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని తెలిపింది. 
 
ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం నిర్ణయించింది. "అంతకముందు చెల్లించిన ఎండీఆర్‌లను ప్రభుత్వం తిరిగి చెల్లించాలని మేము నిర్ణయించాం. డెబిట్‌ కార్డు, యూపీఐ, భీమ్‌, ఆధార్‌ ఎనాబుల్‌ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. చిన్న డిజిటల్‌ వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఊరట" అని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కనీసం రెండేళ్ల వరకు రూ.2000 వరకు జరిపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదన్నారు.