శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (11:43 IST)

రూ.22,999 ధరకే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌

OnePlus Nord CE 5G
వన్‌ప్లస్ చాలాకాలంగా ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. రూ.22,999 ధరకే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది వన్‌ప్లస్. గతంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మాత్రమే రిలీజ్ చేసిన వన్‌ప్లస్... నార్డ్ సిరీస్‌లో మిడ్ రేంజర్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది. 
 
వన్‌ప్లస్ గతేడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000 లోపు బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.24,999. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ ఔట్ ఆఫ్ స్టాక్‌లో కనిపిస్తోంది. దీంతో కస్టమర్లు అంతకన్నా ఎక్కువ ఖర్చు చేసి వన్‌ప్లస్ నార్డ్ కొనాల్సి వస్తోంది. ఇప్పుడు రూ.22,999 బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ రిలీజ్ అయింది.
 
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్పెసిఫికేషన్స్ గురించి పలు లీక్స్ కూడా వచ్చాయి. మొత్తానికి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ అధికారికంగా రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 
 
6.43 అంగుళాల 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది.