శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (11:27 IST)

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా.. లేదంటే..?

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా.. లేదంటే.. డిసెంబర్ 31వ తేదీలోపు ఆ పనిని పూర్తి చేయండి. పాన్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ ఆధార్ నెంబర్లను పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది. ఇప్పటికే ఏడు సార్లు చివరి తేదీలను పొడిగించింది.
 
కానీ ఇటీవలే డిసెంబర్ 31 చివరి తేదీ అని ప్రకటించింది. అయినా ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివాళ్లున్నారు. ఈసారి ప్రభుత్వం చివరి తేదీ పొడిగించే అవకాశం కనిపించట్లేదు. డిసెంబర్ 31 లోగా ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించే ఛాన్సుంది.