బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (14:29 IST)

పానసోనిక్ నుంచి "ఎలుగా ఏ4": అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ చిప్‌తో డేటా జరభద్రం

పానసోనిక్ ఇండియా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోన్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ బ్యాటరీ కారణంగా షియోమీ ‘రెడ్‌మీ నోట్ 4’కు ఇది గట్టి పోటీ ఇస్తుందని ఐటీ నిపుణులు భావిస్

పానసోనిక్ ఇండియా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోన్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ బ్యాటరీ కారణంగా షియోమీ ‘రెడ్‌మీ నోట్ 4’కు ఇది గట్టి పోటీ ఇస్తుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. సమాచార భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ చిప్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ఇందులోని అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ చిప్ వల్ల ఫోన్‌లోని సమస్త సమాచారం భద్రంగా ఉంటుందని పానసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రాణా తెలిపారు. "ఎలుగా ఏ4" పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుంది. ధర రూ.12,490. మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. 
 
ఫీచర్లు.. 
5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 
ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13 మెగా పిక్సల్ రియర్, 
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్న ‘ఎలుగా ఏ4’ ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది.
3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.