ఆపిల్, శామ్‌సంగ్‌కు చుక్కలు చూపిస్తున్న జియోమీ.. ఎలా?

Last Updated: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:18 IST)
అత్యాధునిక సాంకేతికతతో, చౌకధరలో మొబైల్ ఫోన్లను వినియోగదారులకు అందించేందుకు జియోమీ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. చౌకధరలో ఫోన్లను అందించడంలో ఆపిల్, శామ్‌సంగ్ వంటి సంస్థలకు జియోమీ చుక్కలు చూపిస్తోంది. ఈ సంస్థకు చెందిన రెడ్‌ మీ సిరీస్ ఫోన్లు అద్భుతంగా పనిచేయడంతో.. వినియోగదారులు జియోమీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. 
 
జియోమీకి చెందిన చౌక ఫోన్లు, ఇతరత్రా ఫోన్లపై ఒక్కో అప్‌డేట్‌ను స్వాగతిస్తున్నారు. ఇటీవల రెడ్‌ మీ 7 సెల్‌ఫోన్‌ను జియోమీ చైనాలో విడుదల చేసింది. అక్కడ జియోమీకి చెందిన Redmi Note 7 Proను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సీఈవో తెలిపారు. ఈ ఫోన్‌లో సోనీ ఐఎమ్ఎస్ 86 సెన్సార్ వుంటుందని.. 48 మెగాపిక్సల్ కెమెరా వుంటుందని చెప్పారు. 
 
3జీబీ రామ్, 32జీబీ స్టోరేజ్, 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లు వున్నాయి. ఈ ఫోన్ ధర రూ.15,800లుగా వుంటుందని జియోమీ సంస్థ వెల్లడించింది. జూన్ నెలలో రెడ్ మీ నోట్ 7 ప్రోను విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఇంకా పలు ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు జియోమీ సన్నద్ధమవుతోంది.దీనిపై మరింత చదవండి :