శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (18:55 IST)

ఏపీఎస్ఎస్‌డీసీ నోటిఫికేషన్.. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సంస్థలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నిరుద్యోగులకు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రముఖ సంస్థలకు, నిరుద్యోగులకు వారధిగా ఉంటూ వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. రిలయన్స్, పేటీఎం, ఫ్లిప్ కార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లోనూ ఉద్యోగాలను కల్పిస్తోంది సంస్థ. 
 
తాజాగా ప్రముఖ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సంస్థ (Reliance Smart Point)లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
 
మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు.