శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (18:36 IST)

స్టే హోమ్ స్టే హ్యాపీ.. శాంసంగ్ కొత్త ఆఫర్‌ గురించి తెలుసా?

''స్టే హోమ్ స్టే హ్యాపీ'' పేరిట ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో ఏకంగా 15 శాతం క్యాష్ బ్యాక్, ఈఎంలపై ఎటువంటి అదనపు చెల్లింపులు ఉండవని శాంసంగ్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కోసం శాంసంగ్ షాప్, ఎక్స్ ప్రెస్ డెలివరీలలో ఈ నెల 8వ తారీఖు లోపు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇక ఇందులో కేవలం టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 
 
కాగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రస్తుతం మూడో సారి మే 17 వరకు లాక్ డౌన్ అమలులో వుంది. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొన్నిటికి మినహాయింపు ఇచ్చి పనులు మొదలు పెట్టడం జరిగిన విషయం తెలిసిందే. ఈ జోన్‌లో నిత్యావసర వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి లభించిన సంగతి విదితమే.