బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (11:01 IST)

38శాతం రాయితీ... రూ.29,990లకే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7పై బంపర్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మొబైల్‌పై ఫ్లిఫ్ కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీజన్ లూట్‌ సేల్‌లో భాగంగా పాత స్టాక్‌ను క్లియరెన్స్ సేల్ కింద వదిలించుకోవాలనుకుంటున్నాయి. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మొబైల్‌పై ఫ్లిఫ్ కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీజన్ లూట్‌ సేల్‌లో భాగంగా పాత స్టాక్‌ను క్లియరెన్స్ సేల్ కింద వదిలించుకోవాలనుకుంటున్నాయి. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ, షియోమీ, రెడ్‌మీ, మోటో, వైబ్ తదితర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు ప్రకటించింది. 
 
ఇప్పటికే దసరా, దీపావళి పండుగ సీజన్‌లో భారీ రాయితీలతో వినియోగదారులను ఈ-కామెర్స్ సంస్థలు ఆకర్షించాయి. తాజాగా క్లియరెన్స్ సేల్ తరహాలో గతేడాది విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7ను ఆఫర్‌లో భాగంగా రూ.29,990కే విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.46 వేలు కాగా, రూ.16,010 (34 శాతం) రాయితీ ప్రకటించింది.  
 
ఈ ఫోనుపై 34శాతం రాయితీ ప్రకటించిన ఫ్లిఫ్‌కార్ట్ రూ.25వేలతో ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనిప్రకారం రూ.16వేల రాయితీ లభించడంతో పాటు రూ.25వేల ఎక్చేంజ్ కలుపుకుంటే రూ.4,990లకే ఈ ఫోను దక్కించుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్7లో అదిరే ఫీచర్లున్నాయి. క్వాడ్ హెచ్‌డీ స్క్రీన్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్ వంటివి ఈ ఫోను కలిగివుంటుంది.