శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (16:09 IST)

న్యూ ఫోన్-న్యూ ఇయర్... వివో బంపర్ ఆఫర్.. రూ.101 చెల్లిస్తే చాలు...

క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా న్యూ ఫోన్ - న్యూ ఇయర్ పేరుతో చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మొబైల్స్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో ఏదానికైనా కేవలం రూ.101 చెల్లించి చేసుకోవచ్చు. 
 
మిగిలిన మొత్తాన్ని ఆరు ఈఎంఐల ద్వారా చెల్లించుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా వివో నెక్స్, వివో వీ 11, వివో 11 ప్రొ, వివో వై 95, వివో వై 83 ప్రొ, వివో వై 81-4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో వుంచింది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ నెలాఖరు వరకు వుంటుంది. 
 
దేశ వ్యాప్తంగా అన్నీ అథరైజ్డ్ ఔట్‌లెట్లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని  కంపెనీ తెలిపింది. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీబీ, క్యాపిటల్‌ ఫస్ట్‌ లాంటి సంస్థల ద్వారా ఫైనాన్సింగ్‌ సౌకర్యం పొందే అవకాశం వుంది. ఈ ఆఫర్‌కు సాధారణ ఈఎంఐ ఆఫర్ వర్తించదు. ప్రాసెసింగ్ రుసుము కింద రూ.399 చెల్లించాల్సి వుంటుంది.