ఈ నెల 19న వివో ఎక్స్27 మొబైల్.. సరికొత్త ఫీచర్లేంటంటే?

మోహన్| Last Updated: గురువారం, 7 మార్చి 2019 (18:21 IST)
మొబైల్ మార్కెట్‌లో రసవత్తరమైన పోటీ నెలకొంది. షియోమీ, వీవో, ఒప్పో వంటి చైనా మొబైల్‌లు భారత మార్కెట్‌ను ఇప్పటికే దున్నేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న వినియోగదారుల అవసరాల కారణంగా ఈ సంస్థలు సరికొత్త మోడల్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆ క్రమంలో వివో సంస్థ మరో మోడల్‌ని ప్రవేశపెట్టనుంది. 
 
వివో ఎక్స్27 పేరుతో సరికొత్త ఫోన్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. దీని వివరాలను ఇంకా వెల్లడించలేదు. వినియోగదారులను బాగా ఆకట్టుకునే రీతిలో ఇందులో సరికొత్త ఫీచర్లను అందించనున్నారు.
 
వివో ఎక్స్27 ప్రత్యేకతలు:
6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే,
2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్,
8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై వెర్షన్‌తో పని చేస్తుంది,
డ్యుయ‌ల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది,
48, 5, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.దీనిపై మరింత చదవండి :