గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (17:17 IST)

వాట్సాప్ నుంచి డార్క్ మోడ్ ఫీచర్.. కంటిని కాపాడుకోవచ్చు...

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగివున్న వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. కోట్లాది మంది యూజర్లున్న వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఆప్షన్ రానుంది. యూజర్లు కావాలనుకుంటే డార్క్ మోడ్‌ ఆన్ చేసుకోవచ్చు. తద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ రాబోతోంది. 
 
ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్ లాంటి అనేక యాప్స్‌లో డార్క్ ఫీచర్ వుంది. ఇదే తరహాలో ఈ నెలాఖరులోపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో డార్క్ మోడ్ ఆప్షన్‌ను అందించేందుకు వాట్సాప్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. డార్క్‌‍మోడ్‌తో చీకట్లో కళ్లను కాపాడుకోవటమే కాదు.. బ్యాటరీని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ ఏడాది వినియోగదారులకు పలు ఫీచర్లు ఇచ్చిన వాట్సాప్.. ప్రస్తుతం డార్క్ మోడ్ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది.