భారత మార్కెట్లోకి రెడ్ మీ 5ఏ: ఫీచర్స్.. ఫస్ట్ లుక్ (వీడియో)

గురువారం, 30 నవంబరు 2017 (17:38 IST)

భారత మార్కెట్లోకి షియోమి సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అది కూడా చౌక ధరకే. దేశ్‌కా స్మార్ట్ ఫోన్ అన్నట్లు షియోమీ విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5ఏ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి వుంటుంది. ఆకట్టుకునే ఫీచర్లతో.. ఫ్లిఫ్ కార్ట్ స్టోర్‌‌లో డిసెంబర్ ఏడో తేదీ నుంచి తొలి సేల్ ప్రారంభం అవుతుంది. 
 
గురువారం జరిగిన ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమంలో ధర, ఫీచర్లను ప్రకటించారు. దీని గురించి ప్ర‌త్యేకంగా రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్లు కూడా చేసింది. తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ 16బీజీ)ను రూ.4,999కే అందించనున్న‌ట్లు రెడ్‌మీ ఇండియా ప్ర‌క‌టించింది. తొలుత బుక్ చేసుకునే 50లక్షల రెడ్ మి5 కస్టమర్లకు ఐదువేల ధరను.. ఆపై రూ.5,999లకు ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. 
 
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయంతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్‌ను కలిగివుంటుంది. 2జీబీ ర్యామ్, 5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు, 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోను కలిగివుంటుంది. డుయెల్ సిమ్ (నానో ప్లస్ నానో), ఎంఐయుఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ నాగౌట్‌తో ఇది పనిచేస్తుంది. ఏడు గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ సర్వీస్, 137 గ్రాముల బరువును ఈ స్మార్ట్ ఫోన్ కలిగివుంటుందని సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను వీడియోలో చూడండి.
 దీనిపై మరింత చదవండి :  
India Smartphone Features Megapixel Camera Xiaomi Redmi 5a

Loading comments ...

ఐటీ

news

జియో యూజర్లకు గుడ్‌న్యూస్...

తమ యూజర్లకు రిలయన్స్ జియో ఓ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రిపుల్ క్యాష్ ...

news

వాట్సాప్ న్యూ ఫీచర్: చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు

సామాజిక ప్రసారమాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ...

news

జియో గుడ్ న్యూస్ : 4జీ ఫీచర్ ఫోన్ సెకండ్ సేల్

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో ...

news

ఆర్థిక లావాదేవీలకు ఎస్బీఐ కొత్త మొబైల్ అప్లికేషన్ యోనో

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు అన్ని రకాల ఆర్థిక లావాదేవీల ...