ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..

redmi note 7
మోహన్| Last Updated: బుధవారం, 13 మార్చి 2019 (18:35 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ పై ఆప‌రేటింగ్ అప్‌డేట్ పొంద‌నున్న తన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈరోజు వెల్లడించింది. ఈ జాబితాలో ప్రకటించిన ఫోన్‌లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ ల‌భిస్తుంద‌ని సంస్థ పేర్కొంది. దీని వల్ల యూజర్లు కొత్త ఓఎస్‌లో సరికొత్త ఫీచర్లును పొందవచ్చు. వీటితో పాటు మరికొన్ని ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. 
 
ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో, నోట్ 5 ప్రో, రెడ్‌మీ 6 ప్రో, రెడ్‌మీ వై2, ఎంఐ 6ఎక్స్‌, ఎంఐ8, ఎంఐ8 ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్‌, ఎంఐ8 ప్రో, ఎంఐ8 ఎస్ఈ, పోకో ఎఫ్‌1, ఎంఐ మిక్స్ 2ఎస్‌, ఎంఐ మ్యాక్స్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను అందించనుంది.
 
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..
రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్ల‌స్‌, ఎంఐ 5ఎక్స్‌, ఎంఐ మిక్స్, ఎంఐ మిక్స్ 2, ఎంఐ 5, ఎంఐ 5ఎస్‌, ఎంఐ 5ఎస్ ప్ల‌స్‌, ఎంఐ 6, ఎంఐ నోట్ 2, ఎంఐ నోట్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను షియోమీ సంస్థ విడుదల చేయనుంది.దీనిపై మరింత చదవండి :