సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (09:10 IST)

ఇల్లు అద్దెకు కావాలని వచ్చి ఇంట్లో శృంగారం - విస్తుపోయిన యజమాని

couple
హైదరాబాద్ నగరంలోని బీకే గూడలో టూ లెట్ బోర్డు పెట్టిన ఓ ఇంటిని చూస్తేందుకు భార్యాభర్తలుగా వచ్చిన యువతీ యవకులు ఇల్లు చూసేందుకు వెళ్ళి ఆ ఇంట్లోనే ఏకంగా శృంగారంలో పాల్గొన్నారు. ఇంటిని చూసేందుకు వెళ్ళిన ఈ జంట ఎంతకీ రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పైకెళ్లి చూశాడు. అపుడు వారిద్దరు ఉన్న భంగిమను చూసి ఆయన విస్తుపోయాడు. ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమీర్ పేట పరిధిలోని బీకే గూడలో టూలెట్ బోర్డు తగిలించి వున్న ఇంటి వద్దకు బైక్‌పై ఓ యుువతి, యువకుడు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలంటూ ఆ ఇంటి యజమానిని అడిగారు. పై పోర్షన్ ఖాళీగా ఉందని యజమాని చెప్పడంతో, దాన్ని చూడటానికి వారిద్దరూ పైకి వెళ్లారు. అయితే, వారు ఎంతకీ కిందికి రాకపోవడంతో ఇంటి యజమాని పైపోర్షన్‌కు వెళ్లి చూడగా, అక్కడ ఆయనకు కనిపించిన దృశ్యం చూసి విస్తుపోయాడు. 
 
ఇంటి అద్దె కోసం వచ్చిన యువతీ యువకుడు ఏకంగా శృంగారంలో మునిగిపోయివున్నారు. దీంతో యజమాని ఆగ్రహంతో ఊగిపోతు కేకలు వేయడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆ ప్రేమ జంటను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.