శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (13:20 IST)

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నారా?

ఒక్కోసారి పిల్లల్లో పట్టరాని కోపాన్ని చూస్తుంటాం. ఇది వారిని మానసికంగా, శారీరకంగా అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది. కనుక దీన్ని నియంత్రించడం ఎంతైనా ముఖ్యం. కోపంతో మీ అమ్మాయి గట్టిగా అరుస్తున్నప్పుడు మీరు తనపై కేకలు వేయడం సరికాదు.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెత ఈ సందర్భానికి చాలా ఉపకరిస్తుంది. కాబట్టి అమ్మాయి కోపం తగ్గేవరకు మీరు కాసేపు మౌనంగా ఉండడం మేలు.
 
పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తారనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. కోపం వచ్చినప్పుడల్లా మీరు ఇతరుల మీద అరుస్తూ.. పిల్లల్ని మాత్రం అలా చేయొద్దని చెబితే వాళ్లు వినరు. కాబట్టి ఈ విషయంలో మీరు వారికి ఆదర్శంగా ఉండాలి. కోపాన్ని తగ్గించాలండే.. 1 నుండి 10 వరకు లెక్కించండి. లేదా ఏదైనా పుస్తకం చదవండి. ఇవన్నీ మీరు చేస్తే మీ పిల్లలు మిమ్మల్లి గమనిస్తారు. 
 
కోపం వలన కలిగే నష్టాలను మీ పిల్లలకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ఆరోగ్యానికి మంచిదికాదని వివరించాలి. అవవడం, కోపం తెచ్చుకోవడం వలన ఏ సమస్యా పరిష్కారం కాదని.. దీనివలన కొత్త ఇబ్బందులు మాత్రమే తలెత్తుతాయని తెలియచేయండి.