పిల్లలకు టీ, కాఫీలు ఇవ్వవచ్చా?
పిల్లలకు టీ, కాఫీలకు బదులు పాలు ఇవ్వడం అలవాటు చేయాలని పెద్దలు చెప్తుంటారు. పిల్లలకు టీ, కాఫీలకు బదులు పాలు ఇవ్వాలని, ఆ పాలలో పసుపు, మిరియాల పొడి కలిపితే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలకు పండ్లను ఇవ్వడం అలవాటు చేయాలని, విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను ఇవ్వడం చాలా మంచిది. జామ, బొప్పాయి, నారింజ వంటి పండ్లతో పాటు కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి.
కూరగాయలు, పండ్లు, మిరియాల పాలు, పసుపు కలిపిన పాలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా వుంటారు. ఇంకా గ్రీన్ టీ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వారానికి ఒకటి లేదా రెండు సార్లు మితంగా ఇవ్వాలి. జలుబు, దగ్గు తగ్గలేదంటే పిప్పరమింట్ టీని అందించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.