శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:37 IST)

నువ్వు ఎందుకు పనికిరావ్.. అని వారిని తిడుతున్నారా..?

చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూనే ఉంటారు. అదికూడా, నాలుగు తగిలిస్తే గానీ మాట వినరని అప్పుడప్పుడూ అంటుంటాం. కానీ ప్రతిదీ అరచి, తిట్టి చెప్పడం వలన ఎంత మాత్రం పిల్లల వికాసానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. 
 
నలుగురితో స్నేహంగా, సరదాగా గడిపే పిల్లలు కొందరు ఉంటారు. వాళ్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా.. అలానే మీ పిల్లలు కూడా కావాలనుకుంటే వాళ్ల ఎదురుగా తిట్టడం, అరవడం మానేయాలి. ఎందుకంటే.. తిట్లు తినే పిల్లల మనసులో విపరీతమైన భయం పేరుకుపోతుంది. దాంతో వాళ్లు ఎవరితోనూ మనస్పూర్తిగా కలవలేరు. ఒకవేళ కలిసినా ఎవరేం తిడతారనే భయంతో ఉంటారు. 
 
పదేపదే మీ పాపనో, బాబునో.. నువ్వు ఎందుకు పనికిరావ్, మొద్దుమొహం అని తిడుతూ ఉన్నారనుకోండి.. అది కూడా అందరికి ఎదురుగా.. కొన్ని రోజులకు వాళ్లలో నిజంగానే తాను దేనికి పనికిరాను అనే భావన వారిలో ఏర్పడుతుంది. అదే క్రమంగా ఆత్మవిశ్వాస రాహిత్యానికి కారణమవుతుంది. 
 
కనుక ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నా పిల్లల పట్ల నా ప్రవర్తన ఎలా ఉందని.. ఈ విషయంలో మీకే మాత్రం అంసతృప్తిగా అనిపించినా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే సరిపోతుంది.