గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 మే 2021 (19:48 IST)

ఇతరులకు ఉపయోగపడే వాడిని కూడా ఉపయోగపడకుండా చేస్తాడు

వేరుపురుగు చేరి వృక్షంబు చెరచు
చీడపురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!!
 
భావం: వేరుకు పట్టిన పురుగు చెట్టును ఆమూలాగ్రం నాశనం చేస్తుంది. ఇక చెట్టుపైన ఆకులకో, కొమ్మలకో పట్టిన పురుగు తను వున్నంతమేర చెట్టును పాడు చేస్తుంది. నీడ, పండ్లూ మొదలైనవి ఇస్తూ చెట్టు లోకానికి మేలు చేస్తూ వుంటుంది. వేరుపురుగు, చీడ పురుగు ఆ చెట్టును పాడుచేసి దానివల్ల లోకానికి మేలు లేకుండా చేస్తాయి.
 
అలాగే చెడుబుద్ధి కలవాడు మంచి గుణాలు కలిగినవాడి దగ్గరకు చేరి, వాడిని కూడా చెడగొడతాడు. తను ఎవరికీ ఉపయోగపడకపోగా, ఇతరులకు ఉపయోగపడే వాడిని కూడా ఉపయోగపడకుండా చేస్తాడు. కుత్సితుడు వేరుపురుగు.