బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (09:09 IST)

వీధి కుక్కలను కొట్టించినట్టు కొట్టిస్తా : బీజేపీ అభ్యర్థి వార్నింగ్

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ మహిళా అభ్యర్థి గట్టివార్నింగ్ ఇచ్చారు. వీధి కుక్కలను కొట్టిస్తానంటూ హెచ్చిరించారు. తనను అడ్డుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నిచండంతో ఈమె ఈ విధంగా హెచ్చరించారు. ఆమె పేరు భారతీ ఘోష్. 
 
రాష్ట్రంలోని ఘటాల్ నియోజకవర్గం నుంచి ఆమె లోక్‌సభ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వేయి మందిని తీసుకువచ్చి దాడికి దిగుతామని, టీఎంసీ వారిని తరిమితరిమి కుక్కలను కొట్టినట్లు కొడుతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ వారు అందరినీ భయపెడుతున్నారని, సరిగ్గా ఓటేయనిచ్చేలా లేరని, ప్రజలను భయపెడితే వారిని ఇళ్లలో నుంచి తరిమి తరిమి కొడుతామని తెలిపారు. 
 
టీఎంసీ అధినేతి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్న భారతీ ఘోష్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆమె బెదిరింపులను సీఎం మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి బెదిరింపులు మానుకోకపోతే పాత కథలు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో భారతీ ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేశారు. అవినీతి ఆరోపణలపై సస్పెండయ్యారు. ఈ మహిళ అప్పట్లో తనకు పంపిన ఎస్‌ఎంఎస్ బయటపెడితే ఆమె ఎక్కడికి పోతుందో తెలియదని మమత హెచ్చరించారు.