శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By

డీడీతో డీల్... యూట్యూబ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఇందుకోసం ప్రపంచం యావత్తూ ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి పట్టంకట్టాయి. అయితే, వాస్తవ ఫలితాలు వెల్లడయ్యేందుకు మరికొన్నిగంటల సమయం మాత్రమే ఉంది. 
 
ఈ ఫలితాలను లైవ్ చేసేందుకు ఇప్పటికే జాతీయ, స్థానిక చానళ్లన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకోగా, ఇప్పుడు ప్రసారభారతి కూడా ముందుకొచ్చింది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌తో కలిసి ఓట్ల లెక్కింపును యూట్యూబ్ ద్వారా లైవ్‌లో అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
 
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా డీడీ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుందని ప్రసార భారతి సీఈవో శశిశేఖర్‌ వెంపటి వెల్లడించారు. యూట్యూబ్‌ను ఓపెన్ చేసే వారికి అన్నింటికంటే పైన ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం కనిపిస్తుందన్నారు. మొత్తం 14 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు.