నా స్టాఫ్ అంతా పడుకున్నారు... నరసాపురంలో నాగబాబుకి చుక్కలు చూపిస్తా...

dr ka paul
Last Updated: మంగళవారం, 26 మార్చి 2019 (18:27 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ నామినేషన్‌ను భీమవరంలో తిరస్కరించారు. ఆయన భీమవరంతో పాటు మెగా బ్రదర్ పోటీ చేస్తున్న నరసాపురం లోక్ సభ స్థానానికి కూడా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరాజయం ఖాయమైందని చెపుతున్న పాల్, నరసాపురంలో నాగబాబుకి చుక్కలు చూపిస్తానంటున్నారు.

ప్రజలు ప్రజాశాంతి పక్షాన వున్నారని అంటున్నారు. మొత్తం 175 చోట్ల పోటీ చేసేందుకు తను విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బస చేసి బీ ఫార్మ్స్ దగ్గరపెట్టుకుని నిన్న రాత్రి తెల్లవారు జాము వరకూ మేలుకునే వున్నానంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తనకోసం పనిచేస్తున్న స్టాఫ్ అంతా పడుకున్నారనీ, అందువల్ల ఆయా పార్టీలకు ఎవరైతే రెబల్స్ వున్నారో వాళ్లంతా ప్రజాశాంతి పార్టీ కోసం పనిచేయాలని, మన ప్రభుత్వం వస్తే అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఓ సెల్ఫీ వీడియో ద్వారా పిలుపునిచ్చారు. మరి ప్రజాశాంతి పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారో... తేలాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :