పులివెందులలో జగన్‌ను ఓడించడానికి ఓ పిల్లకాయ్ చాలు...

dr ka paul
Last Modified శనివారం, 23 మార్చి 2019 (16:57 IST)
పులివెందుల స్థానం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని అందరికీ తెలిసిందే. అలాంటిది... ఆ కోటలో పాగా వేస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అసలు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఓడించి డిపాజిట్లు గల్లంతు చేయడానికి తమ పార్టీ నుంచి ఓ పిల్లకాయ్ చాలంటూ సెటైర్లు వేయడం విశేషం.

ఇంకా ఆయన మాట్లాడుతూ... తనకు వచ్చిన హెలికాప్టర్ గుర్తును చూసి జగన్ జడుసుకుంటున్నారనీ, ఆయనకు ఫ్యానుకి-హెలికాప్టర్‌కి మధ్య వున్న తేడా ఏమిటో కూడా తెలియదంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి వద్ద లక్షల కోట్లు వున్నాయనీ, తమ వద్ద మాత్రం లక్షల రూపాయలు మాత్రమే వున్నాయన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై మరింత చదవండి :