శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికల సిత్రాలు
Written By జె
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (20:52 IST)

అమ్మ విజయమ్మ రాయలసీమ, కూతురు షర్మిళ కోస్తాంధ్ర... ఏంటి..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈసారి తన ఒక్కడి వల్లే ప్రచారం చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న జగన్ తల్లి విజయమ్మ, షర్మిళను రంగంలోకి దించబోతున్నారు. 
 
షర్మిళ ఈ నెల 27వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రెండు బస్సులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మకు ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. అంతేకాదు జగన్ చెల్లెలు షర్మిళకు జనాదరణ వున్న సంగతి తెలిసిందే. అందుకే జగన్ వీరిద్దరినీ ప్రచారంలో దించేందుకు సిద్థమయ్యారు.