మీరందరూ జనసేన పార్టీకే ఓటు వేయాలి: మెగా డాటర్ నిహారిక

niharika konidela
Last Updated: శనివారం, 16 మార్చి 2019 (15:22 IST)
మెగాస్టార్ ఫ్యామిలీ అంటే అందరికి పిచ్చి ప్రేమ. అంలాటిది నాగబాబు కుమార్తె జనసేన పార్టీకి ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే తండ్రి నాగబాబు జనసైనికులతో సమావేశాలు నిర్వహిస్తూ నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మరోవైపేమో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం బాధ్యతల్ని మోస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నిహారిక తన బాబాయ్‌కి తోడుగా జనసేన పార్టీకి అండగా.. ప్రచారాన్ని మొదలుపెట్టారు. జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఫ్యాన్స్‌ని కోరారు. నిహారిక ప్రస్తుతం సూర్యకాంతం సినిమాలో నటిస్తున్నారు. ప్రణీత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటించారు.

ఈ సినిమాను మార్చి 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు సాగిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌‍లో పాల్గొన్న నిహారికకు పవన్ అభిమానుల నుండి జై పవర్ స్టార్.. జై జనసేన అంటూ నినాదాలు ఎదురయ్యాయి. వారిని మరింత ఉత్సాహపరచి గోలను రెట్టింపు చేశారు నిహారిక. అంతేకాదు, నిహారిక మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అసలు పేరు మీకు తెలుసా.. కొణెదల కళ్యాణ్ కుమార్. ఈయన మా నాన్నకు, చిరంజీవికి తమ్ముడు. నాకు బాబాయ్.

బాబాయ్ జనసేన పార్టీ పెట్టిన ప్రచారంలో బిజీగా ఉన్నారు. నాకేమో ఆంధ్రాలో ఓటు లేదు. కాబట్టి.. మీరందరూ జనసేన పార్టీకే ఓటు వేయాలంటూ ఉత్సాహపరుస్తూ త్వరలో నేను ప్రచారంలో యాక్టివ్ అవుతానన్నారు. జనసేన పార్టీ సింబల్ గ్లాసుతో మంచి ఫోటో మెమొరీగా ఉందని.. ఆ ఫోటోని ఎన్నికల ముందు షేర్ చేస్తానన్నారు. చిరంజీవి మినహా.. రామ్ చరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, బన్నీ, శిరీష్ ఇలా ఒక్కొక్కరుగా పవన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. మెగా డాటర్ నిహారిక ప్రచారంలోకి దిగిపోవడంతో జనసైనికులు ఖుషీలో ఉన్నారు.దీనిపై మరింత చదవండి :