గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ జోకులు
Written By
Last Modified: బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:45 IST)

నా లగేజీని ఎప్పుడూ సిద్దం చేసే ఉంచుతారు..

కావ్యా మా ఇంట్లో మన ప్రేమను ఒప్పుకునేలా లేరు. అందుకే నేనో నిర్ణయానికొచ్చాను. అంటూ తన ప్రేయసితో చెప్పాడు రాజేష్.
 
ఏంటా నిర్ణయం అంటూ రాజేష్‌ను ప్రశ్నించింది కావ్య.
 
ఈ రోజు రాత్రే మనం ఇళ్లు విడిచి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు రాజేష్. 
 
అలాగే తప్పకుండా చేద్దాం అంటూ చెప్పింది కావ్య.
 
కానీ నువ్వు మీ ఇంటి నుంచి ఎలా తప్పించుకుని రాగలవు కావ్యా అంటూ అర్ధం కాక అడిగాడు రాజేష్. 
 
నీకు ఆ భయం అవసరం లేదు ఇలాంటి అవసరం ఏదైనా వస్తుందనే మా అమ్మా నాన్న నా లగేజీని ఎప్పుడూ సిద్దం చేసే ఉంచుతారు అంటూ స్థిరంగా చెప్పింది కావ్య.