నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా
వేణువు విసిరే ప్రేమ గానానివో
విరహ వేదన వీణా నాదానివో
వెన్నెల రాత్రుల మధన సామ్రాజ్యానివో
నన్నల్లుకునే పున్నమి సౌందర్యానివో
ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో
వలపు వసంతాల కోయిల గానానివో
మురిపించే మనోహర అలంకృతానివో
నన్నల్లుకునే నాగమల్లి పొదరిల్లువో