ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:08 IST)

కాలాన్ని మీరు నిరీక్షణలోనే గడిపేస్తారు...? ఇక ప్రేమ పండేదెప్పుడు?

దాదాపు ప్రతి అమ్మాయికి ఒక కలల రాకుమారుడు ఉంటాడు. అంతేకాక తన స్వప్నంలో సాక్షాత్కారించిన రాజకుమారునికి దగ్గరగా ఉండే యువకుని కోసం యువతి వెతుకుతూ ఉంటుంది. తన రాజకుమారుని కన్నా అధికంగా కనిపించే కుర్రవాళ్ల వైపు యువతి కన్నెత్తి కూడా చూడదు. అమ్మాయిల వ్యవహార శైలి ఒక రాగాన అంతుపట్టదు. అందుకే మీకు తగిన గర్ల్‌ఫ్రండ్‌ను ఎంచుకునే సమయంలో మిత్రులు చెప్పే మాటలను సైతం పరిగణనలోకి తీసుకోవడం మంచిది కాదు. అందుకే మీ కోసం చిట్కాలను సిద్ధం చేసి ఉంచాం...
 
మీ బంధాన్ని అర్థం చేసుకోండి:
తొలి చూపులోనే ప్రేమలో పడడం అనేది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చేదే. ఆ సమయంలో మీ కన్నా కూడా మీరు ప్రేమించిన అమ్మాయికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాంటి సమయంలో ఇద్దరూ ఒకచోట కలుసుకుందామని అనుకుంటారు. కానీ అనుకున్న సమయానికి మీ గర్ల్‌ఫ్రండ్ రాదు. గంటల కొద్దీ కాలాన్ని మీరు నిరీక్షణలోనే గడిపేస్తారు. 
 
ఇక విసుగుపుట్టి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. మర్నాడు ఉదయం మీ గర్ల్‌ఫ్రండ్ పంపిన గ్రీటింగ్ కార్డుతో కూడిన ఫ్లవర్ బొకే మీ వాకిట కనపడుతుంది. అందులో సారీ చెప్తున్న మీ గర్ల్‌ఫ్రండ్ ముఖం కనపడుతుంది. అయినా మీరు కరగరు. మూడు రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా మీ నుంచి రెస్పాన్స్ ఉండదు. ఇక బెట్టు మాని కొండ దిగి వచ్చి మీ గర్ల్‌ఫ్రండ్‌ను కలుసుకోండి. తద్వారా మీ బంధాన్ని అర్థవంతం చేసుకోండి.
 
చిన్న చిన్న పొరపచ్చాలు దూరం చేసుకోండి:
ఆడవాళ్లు తమ మనస్సులోని భావనలను ఇతరుల ఎదుట సహజమైన రీతిలో వ్యక్తీకరిస్తుంటారు. తమకు ఏదైనా విషయం ఇబ్బంది కలిగిస్తే అందరికీ చెప్పేస్తారు. అయితే అబ్బాయిల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వకుండా, ముందు నిలిచిన సమస్యలను తమంతటతాముగా పరిష్కరించుకోగిలిగే ధైర్యాన్ని వాళ్లు ప్రదర్శిస్తుంటారు. అందుకే మీ గర్ల్‌ఫ్రండ్‌తో వ్యవహరించేటప్పుడు ఆమె మనస్సు నొచ్చుకోకుండా ప్రవర్తించండి.