గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:53 IST)

మీ ప్రేమను రెట్టింపు చేయాలంటే.. కొన్ని రొమాంటిక్ టిప్స్..?

ఇప్పటి కాలంలో ప్రేమ జంటలు ఎక్కువైపోతున్నాయి. చాలామంది ప్రేమ జంటలు వారి ప్రేమను తెలుపడానికి రొమాంటిక్ వాతవరణాన్నే ఎంచుకుంటున్నారు. కొందరైతే ప్రేమిస్తారు.. కానీ, వారి ప్రేమను వ్యక్తపరచకుండా మనసులోనే దాచుకుంటారు. మరికొందరైతే.. ప్రేమను చెప్పడమే కాకుండా వారి మనసులోనే ఆశలను కూడా తెలుసుకుంటారు. మరి.. మీ ప్రేమను రెట్టింపు చేయాలంటే.. కొన్ని రొమాంటిక్ టిప్స్ మీ కోసం..
 
ప్రేమ వ్యక్తీకరణ కోసం చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రేమ లేదా పెళ్లి వంటి భావోద్వేగాలకు సంబంధించిన వ్యక్తీకరణలను కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా వీటికి సంబంధించింన వ్యక్తీకరణ మీ హృదయం నుండి రావాలి. అప్పుడే మీరు కోరుకున్నవి జరుగుతాయి. మీ భావ వ్యక్తీకరణను ఆమెకు ఇష్టమైన ప్రాంతంలో ప్లాన్ చేసి ఆమెను ఆహ్వానించి మీ ప్రేమను తెలియజేయాలి.
 
ఒకవేళ మీరిద్దరు భయం లేదా సిగ్గుతో ఇబ్బంది పడుతుంటే.. రెస్టారెంట్‌లో బ్యాండ్ వాయించే వారి సహాయంతో పాట, డ్యాన్స్‌లతో మీ ఉద్దేశ్యాన్ని తెలుపాలి. ఇలాంటి సందర్భాలు మాత్రమే కాకుండా, ప్రత్యేక సందర్భాల్లో అంటే.. ఇంట్లో జరిగే కుటుంబ ఫంక్షన్‌లలో మీ అభిప్రాయాలను అందరి ముందు తెలియపరచాలి. అలానే మీ దగ్గరి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేసి.. అందరి ముందు ఆమెపైన ఉన్న ఇష్టాన్ని తెలియజేయండి.. తప్పక మీ ప్రేమను అంగీకరిస్తారు. 
 
ప్రేమను తెలిపే సమయంలో మంచి దుస్తులను, సూట్‌ను ధరించాలి. ఆమెను ఆకర్షించే విధంగా మంచి డ్రెస్, షూలను ధరించి ఆమె ముందు నిలబడాలి. ప్రేమను తెలిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రశాంతంగా ఉండాలి. మీ హృదయం సూచించిన విధంగా నడుచుకుంటూ, ప్రణాళికలను నడిపిస్తూ, మీ ప్రేమను వ్యక్తపరచాలి.