సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (23:00 IST)

మహాశివరాత్రి: గాయని మంగ్లీ ఆది దేవుడు పాట, సద్గురు నృత్యం

శివరాత్రి పర్వదినం సందర్భంగా గాయని మంగ్లీ కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో పాట పాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. జానపద పాటల నుండి బతుకమ్మ పాటల వరకు ఆమె తన ప్రత్యేక గానంతో అందరినీ అలరిస్తుంది.
 
ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదిక అయిన కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీకి పాడే అవకాశం లభించింది. ఆమె పాడుతున్న సమయంలో సద్గురు నృత్యం చేసారు.
 
ప్రతి శివరాత్రిని ఇషా యోగా కేంద్రంలో ఘనంగా జరుపుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.