బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (17:13 IST)

మహాశివరాత్రి జాగరణ.. వసుమతి కథను వింటే..?

Lord shiva
శివరాత్రి జాగరణ చేసేవారు ఈ కథను చదివితే సర్వాభీష్టాలు చేకూరుతాయి. వసుమతి శివరాత్రి వ్రతం ఆచరించడం ద్వారా శివుని అనుగ్రహం పొందింది. శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా దండకారణ్యంలో భాగంగా అడవిలో కృష్ణానదీ తీరాన నివసించారు. 
 
అదే ప్రాంతంలో మునులు కూడా ఆశ్రమం ఏర్పరుచుకుని నివసించేవారు. వారిలో ఒకరే విద్వవజిహ్వర్. ఆయనను చూసేందుకు కౌస్తిమతి అనే ఋషి వచ్చారు. విద్వవజిహ్వర్ ఆయనను స్వాగతించి.. అతిథి సత్కారాలు అందించారు. విద్వవజిహ్వర్ యుక్త వయస్సులోనే సన్యాసం స్వీకరించాడు. అయితే ఇది సరికాదని, వివాహం చేసుకోవాలని.. సంతానం పొందాలని లేకుంటే పితరుల శాపానికి కారణం అవుతారని కౌస్తిమతి హితబోధ చేశారు. అందుకే అగస్త్య మహాముని లోపముద్రను వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. 
 
అంతేగాకుండా కౌస్తిమతి తన కుమార్తె వసుమతిని వివాహం చేసుకోమని అభ్యర్థిస్తాడు. కానీ విద్వవజిహ్వర్ అందుకు అంగీకరించలేదు. సంసార సాగరంలో మునిగి ఇబ్బందులు ఎదుర్కోవడం సరికాదన్నాడు. తానే తండ్రి మారీచుడి నుంచి దూరమై తపస్సు చేసుకుంటున్నాను. 
 
అయినా తన కర్మ వదలనంటోందని చెప్పుకొచ్చాడు. అయినా కౌస్తిమతి వదలలేదు. తాతయ్య అయిన భరద్వాజ మహర్షి సంసారంలో మునగడం వల్లే విద్వవజిహ్వర్ కలిగారని తెలిపారు. ఇంకా తన కుమార్తె వసుమతి సాధారణ మహిళ కాదు. 
 
గౌతమ మహర్షి మనవడిని తాను. సదానంద మహర్షికి మనవరాలే వసుమతి. పతీవ్రతా శిరోమణులైన పాంచాలీ, సీత, అరుంధతి, అనసూయలకు సమానురాలు. అయినా విద్వవజిహ్వర్ ఒప్పుకోలేదు. ఇంకా దుర్వాస మహర్షి, కన్వ మహర్షి, మార్కండేయుడు, నారదుల వంటి వారు వివాహం చేసుకోకుండా జీవించలేదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. 
 
దీంతో కౌస్తిమతి తన తపోశక్తితో శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో విద్వవజిహ్వర్ వారు ఎందుకు వివాహం చేసుకోలేదనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. దీంతో భూలోకానికి చేరిన కౌస్తిమతి వసుమతి, విద్వవజిహ్వర్ వివాహాన్ని ఘనం నిర్వహించాడు. 
 
ఇంకా వసుమతి శివరాత్రి రోజున వ్రతం ఆచరించడం ద్వారా శివుడిని ప్రత్యక్ష దర్శనాన్ని పొందగలిగింది. అందుచేత శివరాత్రి రోజున జాగరణ చేసేటప్పుడు వసుమతి కథను చదివితే సౌభాగ్యం సిద్ధిస్తుందని శివపురాణం చెప్తోంది.