సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (12:40 IST)

ఫేక్ ఎన్సీసీ క్యాంప్.. 13మంది బాలికలను వేధించారు.. టీచర్లు అరెస్ట్

victim woman
తమిళనాడులో ఫేక్ ఎన్సీసీ క్యాంప్ పేరుతో 13 మంది బాలికలను వేధించిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ఈ అకృత్యం లేటుగా వెలుగులోకి వచ్చింది. 
 
క్యాంప్ పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. విషయాన్ని పెద్దది చేయొద్దంటూ వారిని బెదిరించారు. గత నెలలో కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
సదరు స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లతో పాటు క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
క్యాంప్ బాధ్యతలు మొత్తం దుండగులకే అప్పగించింది. దీంతో బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డారు. క్యాంప్ ముగిసిన తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు తమ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. 
 
విషయం తెలిసిన ప్రిన్సిపాల్ కూడా క్యాంప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని బాలికలను బెదిరింపులకు గురిచేశారు. విషయం బయటపడడంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.