శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (10:42 IST)

16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది. అసలేం జరిగింది? సెప్టెంబర్​ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు.. తనను జీపులో వచ్చి అపహరించాడు. 
 
జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్​ స్టేషన్​లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
 
మత్తుపదార్థాన్ని కలిపి.. బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టేముందు.. తేనీటిలో మత్తుపదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.