ఢిల్లీలో హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవదహనం

delhi hotel fire
Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:43 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

తొలుత హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కాగా, ఈ ప్రమాదం కారణంగా మంగళవారం సాయంత్రం జరగాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నాలుగో వార్షిక వేడుకలను ఆ పార్టీ రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఓ ప్రకటనలో వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :