శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (11:29 IST)

శశికళ భర్త కోసం బ్రెయిన్ డెడ్ యువకుడి కిడ్నాప్...

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త వి.నటరాజన్‌‌కు కిడ్నీ, కాలేయాలను దానం చేసేందుకు అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త వి.నటరాజన్‌‌కు కిడ్నీ, కాలేయాలను దానం చేసేందుకు అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడిని బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ప్రకటించి, ఆ తర్వాత ఆ యువకుడిని హుటాహుటిన చెన్నై గ్లోబెల్ ఆస్పత్రికి తరలించి అతని శరీరం నుంచి సేకరించిన అవయవాలను నటరాజన్‌కు అమర్చేలా చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది 
 
పుదుక్కోట జిల్లా ఆరంతాంగి రోడ్డు సమీపంలో ఓ పూరిగుడిసెలో 19 యేళ్ల కార్తీక్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. ఈ యువకుడు ప్రతి రోజూ గోడకు అన్నాడీఎంకే పోస్టర్లు అంటిస్తూ.. తద్వారా వచ్చే డబ్బులతో వృద్దులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ వచ్చాడు. కడు పేదరికంలో జీవిస్తూ వచ్చిన కార్తీక్... రోజుకు కేవలం 50 రూపాయలు, ఒక్కోరోజు రూ.500 వరకు వచ్చేవి. నెలలో అనేక రోజులు ఎలాంటి పని లేకుండా ఖాళీగానే ఉండేవాడు. 
 
ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చిన నటరాజన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందనీ, తక్షణం అవయవమార్పిడి చేయాలంటూ గ్లోబెల్ ఆస్పత్రి వైద్యులు వరుసగా రెండుసార్లు వైద్య బులిటెన్‌లు విడుదల చేశారు. ఇలా బులిటెన్ విడుదల చేసిన తర్వాత సెప్టెంబర్ 30వ తేదీన కార్తీక్ తన స్నేహితుడి మోటార్ బైక్‌లో వెళుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను తొలుత ఆరంతాంగి ఆస్పత్రికి ఆ తర్వాత పుదుక్కోట ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రి, అక్కడ నుంచి తంజావూరు వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంతలో ఓ అజ్ఞాతవాసి వచ్చి తాను లాయర్‌ను అని, కార్తీక్‌ను మెరుగైన వైద్య చికిత్సల కోసం చెన్నైకు తీసుకెళతానని వైద్యులకు చెప్పి.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకు తరలించి గ్లోబెల్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే గ్లోబెల్ వైద్యులు కార్తీక్ బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర అవయవమార్పిడి విభాగం అధికారులకు సమాచారం చేరవేసి.. కార్తీక్ శరీరం నుంచి కాలేయం, కిడ్నీ తొలగించి నటరాజన్‌కు అమర్చారు. నేత్రాలను మరో కార్పొరేట్ ఆస్పత్రికి పంపారు.