గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (15:09 IST)

ఉన్నట్టుండి రైలు ముందు దూకాడు.. దారుణంగా చనిపోయాడు..

రైలు కోసం వేచి చూసిన ఓ యువకుడు.. ఉన్నట్టుండి రైలు ముందు నిలబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్ ఫామ్‌లో ఆకాష్ అనే యువకుడు తన తండ్రితో పాటు రైలు కోసం వేచి చూస్తున్నాడు. 
 
ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్‌లోకి ఆగేందుకు రైలు వస్తుండగా ఉన్నట్టుండి ఆకాష్ రైలు ముందుకు దూకాడు. ఈ ఘటనలో రైలు పట్టాలపై పడిన ఆకాష్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. కంటిరెప్ప పాటు సమయంలో జరగాల్సినదంతా జరిగిపోయింది. రైలు ముందు నిలబడిన ఆ యువకుడు రైలు చక్రాల కింద నలిగి మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆకాష్ కొద్ది రోజుల పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడని, ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడని.. ఆతని తండ్రి చెప్పాడు. ఇకపోతే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.