గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (11:39 IST)

రాజస్థాన్ అక్కాచెల్లెళ్ళ ఘనత.. ఏం చేశారో తెలుసా?

రాజస్థాన్ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లు ఘనత సాధించారు. ఈ ముగ్గురు సిస్టర్స్ ఆ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌య్యారు. అన్సూ, రీతూ, సుమ‌న్ అనే ముగ్గురు సిస్టర్స్ రాజ‌స్థాన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌లో ఆఫీస‌ర్ ఉద్యోగం సంపాదించారు. ఆ ముగ్గురితో పాటు ఆ కుటుంబానికి చెందిన మ‌రో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు కూడా ఆఫీస‌ర్లు కావడం గమనార్హం. 
 
ఈ విషయాన్ని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప‌ర్వీన్ కస్వాన్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఆ సిస్ట‌ర్స్ ఫోటో షేర్ చేసిన ఆయ‌న వారికి కంగ్రాట్స్ తెలిపారు. కుటుంబానికి చెందిన అయిదురుగు అక్కాచెల్లెళ్లు ఒకే స‌ర్వీస్ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. 
 
హ‌నుమాన్‌ఘ‌ర్ జిల్లాలోని బైరుస‌రి గ్రామంలో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. ఆ అయిదుగ‌రు అమ్మాయిల తండ్రి స‌హ‌దేవ్ శ‌ర‌న్ ఓ రైతు. ఆయ‌న 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దువుకున్నారు. ఇక ఆ అమ్మాయి త‌ల్లి ల‌క్ష్మీ నిర‌క్ష్య‌రాసురాలు. 
 
కానీ, తమ పిల్లలను ఆ తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి చదివించారు. అలాగే, ఆ సిస్టర్స్‌కు కూడా పట్టుదలతో చదివి ఉత్తీర్ణులయ్యారు. త‌మ స‌క్సెస్‌కు పేరెంట్స్ కార‌ణ‌మ‌ని అక్కాచెల్లెళ్లు చెప్పారు. రాజ‌స్థాన్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన ఆర్ఏఎస్ 2018 ప‌రీక్ష ఫ‌లితాల‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప‌రీక్ష‌ల్లో జుంజునూ ముక్తా రావు తొలి ర్యాంక్ సాధించారు.