సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

తిరుపతి మహిళా టెక్కీని వేధించిన తిరుచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు.. ఎక్కడ?

harassment
బస్సులో తన పక్క సీటులో కూర్చొన్న తిరుపతికి చెందిన 35 యేళ్ల మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించిన కేసులో తిరుచ్చికి చెందిన రంగనాథ్ (50) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత సోమవారం ఫ్రాంక్‌ఫ్రట్ నుంచి బెంగుళూకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తుండగా, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన రంగనాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన సీటు పక్కనే కూర్చొన్న తిరుపతికి చెందిన మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించాడు. 
 
నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్టు గుర్తించి ఆమె మేల్కొని విమాన స్బిబంది దృష్టికి తీసుకెళ్లింది. విమానం కెంపేగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... రంగనాథ్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.