గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (10:23 IST)

35 ఏళ్లలోనే చనిపోయాడు.. తమ్ముడు లాంటివాడు.. ఝాన్సీ

jhansi
తన వద్ద పనిచేసే శ్రీను అనే పర్సనల్ సెక్రటరీ 35 ఏళ్ల చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని సీనియర్ నటి ఝాన్సీ విచారం వ్యక్తం చేశారు. శ్రీను, శ్రీనుబాబు అని తాను అతడిని ముద్దుగా పిలుచుకునేదానినని, అతడే తన మెయిన్ సపోర్ట్ సిస్టం అని పేర్కొన్నారు. 
 
తన వద్ద హెయిర్‌ స్టైలిస్ట్‌గా చేరి పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడని తెలిపారు. సున్నిత మనస్తత్వం కలిగిన శ్రీను తన స్టాఫ్ కంటే ఎక్కువని, తనకు తమ్ముడు లాంటివాడని తెలిపారు. తానిప్పుడు చాలా బాధలో ఉన్నానని, మాటలు కూడా రావడం లేదన్నారు. 
 
జీవితం ఒక బుడగలాంటిదని చెబుతూ ముగించారు. ఈ పోస్టు చూసిన వారు అతడి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.